TG: రాష్ట్రంలోని పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమగ్ర ఆడిట్ నిర్వహించి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణను వేగవంతం చేయాలని, మొక్కల సరఫరా నుంచి గెలల సేకరణ వరకు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.