
ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం ఉదయం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఈ వారంలో రెండవ అతిపెద్ద భూకంపం. దీనివల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత వారం మలుకు దీవుల సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు సోమవారం ఆఫ్ఘనిస్థాన్లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 20 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.




