నెలసరి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో కడుపు నొప్పి, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మందులకు బదులుగా సహజ ఉత్పత్తులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నువ్వులు అందుకు అద్భుతమైన ఔషధం. వీటిలో ఉన్న కాల్షియం, ఐరన్, విటమిన్ C గర్భాశయాన్ని బలపరుస్తాయి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. మొదటి 3–4 రోజులు నువ్వులు తీసుకుంటే పీరియడ్స్ సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.