
'అరి' సినిమాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు
దర్శకుడు జయశంకర్ ఏడేళ్ల తర్వాత 'అరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఆసక్తికరమైన కథ, స్క్రీన్ ప్లే, నటన సినిమా విజయానికి కారణమయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ, దర్శకుడు జయశంకర్‌ను అభినందించారు. అంతకుముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సినిమాను అద్భుతంగా ఉందని కొనియాడారు.




