AP: విశాఖ బీచ్‌లో ముగ్గురు బాలురు గల్లంతైన విషయం తెలిసిందే. మల్లయ్యపాలేనికి చెందిన సూర్యప్రకాశ్ (14), నితీశ్ (14), ప్రశాంత్(14) సముద్రంలో గల్లంతైనట్లు పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు. వారి ఆచూకీ కోసం లైఫ్‌గార్డులు సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. బీచ్ వద్ద బాలుర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.