
నకిలీ మద్యం కేసు.. కస్టడీకి నిందితులు
AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 10 మందిని మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శుక్ర, శనివారం నిందితులను ప్రశ్నించనున్నారు. ప్రధాన నిందితుడు సురేంద్ర నాయుడు, కట్టా రాజు సహా 10 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు.




