కొత్తిమీర సాగులో సస్యరక్షణ చర్యలు ఇవే!

88చూసినవారు
కొత్తిమీర సాగులో సస్యరక్షణ చర్యలు ఇవే!
కొత్తిమీర పంటను సరైన సస్యరక్షణతో తెగుళ్ల నుంచి కాపాడితే మంచి దిగుబడి పొందవచ్చు. రసం పీల్చే పురుగులకు వేపనూనె పిచికారీ, తెల్లదోమలకు పసుపు జిగురు అట్టలను ఉపయోగించడం లాంటివి చేయాలి. బూజు, వడ తెగులకు డీనోక్యావ్‌, సూడోమోనాస్‌ పిచికారీ చేయాలి. ఆకు మచ్చలకు కార్బండిజమ్‌ లేదా మాంకోజెట్‌ వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇలా చేస్తే కొత్తిమీర పంటను తెగుళ్లు నుంచి రక్షించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.