వర్షాకాలంలో వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అయితే వాటిని ఎదుర్కొడానికి శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వర్షా కాలంలో కొన్ని రకాల పండ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జామ, నేరేడు పండ్లు, బొప్పాయి, దానిమ్మ, ప్లం లాంటి పండ్లను తినాలి. ఇవి శక్తితో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే పండ్లను శుభ్రంగా కడిగి తినడం చాలా ముఖ్యం.