
వైద్యుల సలహా లేకుండా మందులు వాడితే కిడ్నీలకు ప్రమాదం: CDSCO
ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) హెచ్చరించింది. వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులను పదేపదే లేదా ఎక్కువ కాలం తీసుకోకూడదని స్పష్టం చేసింది. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీ బయాటిక్స్ వాడటం సరైనది కాదని, సొంత వైద్యం మాని కేవలం వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలని సూచించింది.




