దేశవ్యాప్తంగా జూన్ 1, 2026 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. QR కోడ్ స్కాన్ చేసినా, మొబైల్ నంబర్‌కు డబ్బులు పంపినా సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాల్లో ఉన్న అసలు పేరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపే ఛాన్స్ ఉండదు. అలాగే ఆయిల్ కంపెనీలు LPG, CNG, PNG ధరలను సమీక్షించనున్నాయి. రూ.50 వేల క్యాష్ డిపాజిట్లకు పాన్ అవసరం లేదు. ప్రభుత్వ సబ్సిడీలు లేదా నెట్-మీటరింగ్ సౌకర్యం పొందాలంటే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ALMMలో ఉన్న సోలార్ ప్యానెల్స్/మాడ్యుల్స్‌ను మాత్రమే ఉపయోగించాలి.