రాత్రి 12 తరువాత నిద్రపోతే వచ్చే సమస్యలు ఇవే: నిపుణులు

4చూసినవారు
రాత్రి 12 తరువాత నిద్రపోతే వచ్చే సమస్యలు ఇవే: నిపుణులు
రాత్రి 12 తర్వాత రోజూ నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) అసంతుల్యమై గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు మారుతాయి, దీనివల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరం రోగాలతో పోరాడే శక్తిని కోల్పోతుంది, తద్వారా తరచూ అనారోగ్యం బారిన పడతారు. ప్రతిరోజూ రాత్రి నిర్ణీత సమయానికి పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్