అమ్మాయిల్లో నీరసానికి అసలు కారణాలు ఇవే!

0చూసినవారు
అమ్మాయిల్లో నీరసానికి అసలు కారణాలు ఇవే!
అమ్మాయిలు మధ్యాహ్నానికే నీరసించిపోవడానికి, ఉదయం లేవగానే అలసటగా అనిపించడానికి కేవలం పని ఒత్తిడి మాత్రమే కారణం కాదని నిపుణులు వివరిస్తున్నారు. శరీరంలో అంతర్గతంగా జరిగే రక్తహీనత (ముఖ్యంగా ఐరన్ లోపం), హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, క్రమం తప్పని నెలసరి, విటమిన్ B12, D3 లోపాలు, డీహైడ్రేషన్ వంటివి శక్తి స్థాయిలను తగ్గిస్తాయంటున్నారు. సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి కూడా కారణాలే. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం మంచిదంటున్నారు. రోజుకు 7-8 గంటల నిద్ర, తగినంత శారీరక శ్రమతో శక్తిని తిరిగి పొందవచ్చని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్