
వరకట్న వేధింపులు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హత్య!
వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. లక్నోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సి అనే యువతి తన అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. అదనపు కట్నంగా కారు ఇవ్వలేదనే అక్కసుతోనే మాన్సి భర్త సాగర్ రాజ్పుత్, అతని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని ఉరితీశారని మాన్సి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాగర్ రాజ్పుత్, అతని తండ్రి, సోదరుడు, ఇద్దరు ఆడపడుచులు, అత్తపై పోలీసులు వరకట్న మరణం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాగర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




