
వరదలో కొట్టుకొచ్చిన యువకుడి మృతదేహం
TG: వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వరద ఉధృతంగా ప్రవహించింది. కేంద్రంలోని శివనగర్ నేతాజీ స్కూల్ వద్ద వరద ప్రవాహంలో ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడు గీసుకొండకు చెందిన పులి అనిల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. వరదల్లో గల్లంతై మృతి చెందినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




