సంక్రాంతి పండుగను తమిళులు పొంగల్‌గా చేసుకుంటారు. తమిళ తల్లి అయిన తై కొవిల్ పేరు మీదుగా తై పొంగల్ ఫెస్టివల్ చేసుకుంటారు. తమిళనాడులోని కరైకుడిలో ఈ అమ్మవారి దేవాలయం ఉంది. 1993లో తమిళ తల్లి తై కొవిల్ ఆలయం నిర్మించారు. అయితే ఇక్కడ సున్నపురాయితో కట్టిన ఇళ్లు అందరిని ఆకర్షిస్తాయి. మొదటి రోజు పిండి వంటలు చేసి బంధువులకు పెడతారు. రెండో రోజు పశువులను పూజిస్తారు. మూడో రోజు ఫ్యామిలీతో టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తారు.