ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన సాజిద్‌ వద్ద భారత పాస్‌పోర్ట్‌
Dec 16, 2025, 10:12 IST/

ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన సాజిద్‌ వద్ద భారత పాస్‌పోర్ట్‌

Dec 16, 2025, 10:12 IST
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో హైదరాబాద్‌తో సంబంధాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి పాల్పడిన సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. అతని వద్ద భారత పాస్‌పోర్ట్‌ లభించింది. 25 ఏళ్ల క్రితం స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడిన సాజిద్‌ కుటుంబ సభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్‌ గతంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, సాజిద్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.