
105 ఏళ్ల బామ్మకు విజయవంతమైన కీలు మార్పిడి శస్త్రచికిత్స
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కీలు మార్పిడి శస్త్రచికిత్స ఒక ప్రభావవంతమైన పరిష్కారమని వయసు అడ్డంకి కాదని ఢిల్లీలో జరిగిన సంఘటన నిరూపించింది. 105 ఏళ్ల మోర్నీ దేవి అనే వృద్ధురాలికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పాక్షిక తుంటికీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. 24 గంటల్లోనే ఆమె నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.




