తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణానికి టీటీడీ నిబంధనలు ఇవే!

68చూసినవారు
తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణానికి టీటీడీ నిబంధనలు ఇవే!
తిరుమల ఘాట్ రోడ్డులో భక్తుల భద్రత, వన్యప్రాణుల రక్షణ కోసం టీటీడీ ప్రయాణ సమయాలు, నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది. నాలుగు చక్రాల వాహనాలకు ఉదయం 3 నుంచి రాత్రి 12 వరకు, ద్విచక్ర వాహనాలకు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 3 వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తారు. అతి వేగాన్ని నియంత్రించడానికి 'టైమ్ లాక్' విధానం అమలులో ఉంది. నిర్దేశిత సమయానికి ముందే చేరుకుంటే జరిమానా విధించే అవకాశం ఉందని, భక్తులు వేగం తగ్గించి, నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్