
ఎస్‌బీఐ స్కాలర్‌షిప్: విద్యార్థులకు రూ.15 లక్షల వరకు సాయం!
SBI ఫౌండేషన్ ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం 'SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026-27'ను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి విదేశాల్లో ఉన్నత విద్య వరకు విద్యార్థులు రూ.15,000 నుంచి రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. దరఖాస్తు గడువును సెప్టెంబర్ 19 వరకు పొడిగించారు. 9-12 తరగతి విద్యార్థులకు రూ.15,000, UG విద్యార్థులకు రూ.75,000, PG, MBBS, IIT, IIM విద్యార్థులకు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, విదేశాల్లో చదివే వారికి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.




