
రేపే నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు
నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ అనిశ్చితి, జెన్ జీ యువత పోరాటం వల్ల ప్రభుత్వం గతేడాది కూలిపోయింది. సుశీల కర్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.




