ఆరోగ్యకరమైన ఆహారాలు అందరికీ ఒకేలా సరిపోవని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా హైపోగ్లైసీమియా, గుండె, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బొప్పాయి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.