
కారు ఢీకొని వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు (వీడియో)
AP: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పంపనవారి పాలెంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం వెళ్తున్న కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో బ్రాహ్మణచెరువు గ్రామానికి చెందిన జోగి రమేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఆరవల్లి గ్రామానికి చెందిన దంపతులు బాపిరెడ్డి (60), రామలక్ష్మి (55) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




