
హైదరాబాద్లో అరుదైన రాక్ పైథాన్.. వీడియో వైరల్
హైదరాబాద్లోని పాతబస్తీ సిటీ కాలేజీ సమీపంలో అరుదైన 10 అడుగుల రాక్ పైథాన్ కనిపించింది. జంతు సంరక్షణ కార్యకర్త సయ్యద్ తాఖీ అలీ రిజ్వీ దాన్ని సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖకు అప్పగించారు. అధికారులు దాన్ని అడవిలో విడిచిపెట్టనున్నారు. నగరంలో ఇలాంటి అరుదైన పాములు కనిపించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




