
బెంగళూరులో ప్రేమజంట ఆత్మహత్య
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న ఓ టెకీ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన బాబు రెడ్డి(32) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. సోమవారం కొత్తనూరులోని తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతనితో సహజీవనం చేస్తున్న యువతి (31) కూడా అపార్ట్మెంట్లోని 17వ అంతస్తు పైనుంచి దూకి చనిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




