
'చుట్టమల్లే' ఏఐ వివాదం.. ఎన్టీఆర్ మాస్ వార్నింగ్
దేవర చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను ఏఐతో అసభ్యకరంగా మార్ఫ్ చేసి వైరల్ చేయడంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా వీడియోను రూపొందించిన వారిని, దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలను చూడటం, షేర్ చేయడం, ప్రోత్సహించడం ఆపాలని నెటిజన్లను కోరారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు.




