పితృపక్షంలో పూర్వీకులకు పిండప్రదానం చేయడం సంప్రదాయం. అయితే బిహార్‌లోని గయలో జీవించి ఉన్నవారు తమకు తామే పిండప్రదానం చేసుకునే ప్రత్యేక ఆచారం ఉంది. గయలోని జనార్ధన మందిరం వేదిక వద్ద ఈ పద్ధతిని పాటిస్తారు. సంతానం లేనివారు లేదా తమకు పిండప్రదానం చేసే వారు ఎవరూ లేకపోవడంతో.. భవిష్యత్తులో తమ ఆత్మకు శాంతి, మోక్షం కలగాలని కోరుకునే వారు ఇలా పిండప్రదానం చేస్తారని విశ్వాసం. గయలో పూర్వీకులకు శ్రాద్ధం చేస్తే పితృ రుణం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.