కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదని, వారసత్వం కోరుకునేవారే ఆయన చావు కోరుకుంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వద్ద ఉన్న సీఎం సీటును తాను లాక్కున్నానని, ఆయన వద్ద ఇంకేమీ మిగలలేదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెచ్చిపెట్టుకున్న నటన చేస్తున్నారని, వారంతా ఒక్కటేనని, రంగు రుచి వేరు అంతేనని కీలక వ్యాఖ్యలు చేశారు.