TG: హనుమకొండ జిల్లా పరకాల సమీపంలోని మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. శనివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం అర్చకుడు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిడుగుపాటుతో గత కొద్దిరోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, హుండీలో సుమారు రూ.10 వేల వరకు నగదు ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.