శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను అపహరించారు. పార్థసారథి నగర్‌లోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఏటీఎంను బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు మాస్కులు ధరించిన వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు. రాడ్లతో ఏటీఎంను పెకిలించడానికి విఫలయత్నం చేసిన తర్వాత, తాళ్లతో కట్టి వాహనంతో లాగి, ఏటీఎంను వాహనంలోకి ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.