
సెప్టెంబర్లో NSE రూ.30,000 కోట్ల ఐపీఓ
ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తొలి IPO ఈ ఏడాది సెప్టెంబర్లో రానుంది. సుమారు రూ.30వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఈ ఐపీఓ రానుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంఎస్ స్ట్రాటిజిక్ వంటి పలువురు వాటాదారులు తమ వాటాలను విక్రయించనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.




