
సినిమాల్లోకి రాబోతున్న మల్లారెడ్డి!
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో, మేనరిజమ్‌తో నిత్యం వార్తల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి సినిమాల్లోకి రాబోతున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం తనను మూవీ టీమ్ సంప్రదించినా, ఆ పాత్రకు తాను వద్దని చెప్పినట్లు ఆయన తెలిపారు. అయితే, సినిమాల్లోకి రావడం ఖాయమని చెబుతూనే, తన జీవిత కథతో బయోపిక్ తీయాలని, ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తానని, అందులో తాను కూడా ఒక పాత్రలో కనిపిస్తానని మల్లారెడ్డి ప్రకటించారు.




