
మన రాజధాని అమరావతే: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలో 'గొడ్డలి పార్టీ' ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని, ఎన్నికలకు ముందు అమరావతిని రాజధాని అన్నారని, గతంలో మూడు రాజధానులంటూ ఆటలాడి, ఇప్పుడు మావిగన్ అంటున్నారని విమర్శించారు. మన రాజధాని అమరావతేనని.. అది దేవతల రాజధాని అని కొనియాడారు. అమరావతి రాజధానికి కేంద్రం సహకరిస్తోందని, అమరావతిని ఆపడం ఎవరితరం కాదని మండిపడ్డారు.




