కోకాపేటలో ముగిసిన మూడో విడత భూముల వేలం

4చూసినవారు
కోకాపేటలో ముగిసిన మూడో విడత భూముల వేలం
TG: హైదరాబాద్ పరిధిలోని కోకాపేట, నియోపొలిస్ భూములకు మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలంలో HMDAకు కాసుల పంట పండింది. ఇవాళ ప్లాట్ నెంబర్ 19, 20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. దీంతో హెచ్ఎండీఏకు రూ. వెయ్యి కోట్ల మేర ఆదాయం సమకూరింది. మొత్తం 3 విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం లభించింది.

సంబంధిత పోస్ట్