భారత్‌తో మూడో టెస్ట్.. 387 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

63చూసినవారు
భారత్‌తో మూడో టెస్ట్.. 387 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌
అండర్సన్‌-టెండూల్కర్‌ సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో 112.3వ బంతికి బ్రైడన్‌ కార్స్‌ (56) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌(104) శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా.. సిరాజ్ 2, నితీష్ 2, జడేజా ఒక వికెట్ తీశారు.