
కన్నతల్లిని, తమ్ముడిని నరికి చంపిన కొడుకు
AP: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజలను సోమవారం ఉదయం కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం 112కు ఫోన్ చేసి పోలీసులకు లొంగిపోయాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు కరోనా సమయంలో తండ్రి మరణం తర్వాత మతిస్థిమితం కోల్పోయాడని గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పరీక్షిస్తున్నామని అన్నారు.




