తిరువూరు హత్య కేసు.. నిందితులను పట్టించిన క్యూఆర్ కోడ్

41చూసినవారు
తిరువూరు హత్య కేసు.. నిందితులను పట్టించిన క్యూఆర్ కోడ్
AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వడిత్య రాజేశ్, అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అలేఖ్యకు నున్న గ్రామానికి చెందిన కృష్ణసేనతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన ప్రియుడితో కలిసి ఉండాలని భావించిన అలేఖ్య.. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. సుపారీ గ్యాంగ్ సహాయంతో అతడిని హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన మద్యం బాటిల్ క్యూఆర్ కోడ్‌ సాయంతో నిందితులను పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్