అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ పాలకులు బహుమతిగా ఇచ్చిన 747 జంబో జెట్ విమానాన్ని ఆవిష్కరించారు. దీనిని 'ఎగిరే వైట్‌హౌస్'గా అభివర్ణించిన ట్రంప్, ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానమని పేర్కొన్నారు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో,
విమానం ఇంటీరియర్ డిజైన్, ఇంజిన్ల నాణ్యతను ప్రశంసించారు. ఇది ఎయిర్‌ఫోర్స్ వన్ కంటే వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. జులై 4న జరిగే
అమెరికా స్వాతంత్ర్య వేడుకల్లో విమానాల ప్రదర్శనలో ఇది పాల్గొనే అవకాశం ఉంది.