ఇదేం చిలుకరా బాబు!.. ఫోన్ ఆన్‌ చేసి వీడియోలు చూస్తోంది (వీడియో)

5804చూసినవారు
మొబైల్‌లో చిలుకల వీడియోలు, వివిధ యాప్స్‌ చూస్తూ.. స్క్రీన్‌పై ముక్కుతో ట్యాప్‌, స్వైప్‌ చేస్తున్న ఓ చిలుక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో చిలుక చక్కగా ఫోన్ లాక్‌ తీసి, యూట్యూబ్ ఆన్‌ చేసి వీడియోలు చూసుకుంటుంది. పక్కనే యజమాని రోజూ ఇదే పనిగా చూస్తుందని చెప్పడం, ఇది సైలెంట్‌గా వీడియోలు చూడటం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. యజమాని ఫోన్‌ తీసుకునేందుకు ప్రయత్నించగానే చిలుక ఎగిరిపోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ‘ఫోన్‌కు ఇంతగా అలవాటు పడిందా?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్