ఫిష్ వెంకట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన నటుడు. అతను ఎక్కువగా తెలంగాణ యాసలో హాస్య, ప్రతినాయక పాత్రలు పోషించాడు. వి.వి.వినాయక్ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 'ఆది' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుమారు 90 సినిమాల్లో నటించాడు. అతని చివరి సినిమా 'కాఫీ విత్ కిల్లర్', ఇది ఆహా ఓటీటీలో విడుదలైంది. కాగా, ఆయన శుక్రవారం రాత్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోయిన విషయం తెలిసిందే.