పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ నరేంద్ర
మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యారక్‌పూర్ ర్యాలీలో మాట్లాడుతూ, “ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి బహిరంగ సభ. ఫలితాల తర్వాత జరిగే
బీజేపీ ప్రమాణస్వీకారానికి తప్పకుండా వస్తానన్న నమ్మకంతో వెళ్తున్నా” అన్నారు. ప్రజల భారీ స్పందన తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చివరి విడత పోలింగ్‌కు ముందు అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేయగా, మే 4న
ఫలితాలు వెలువడనున్నాయి.