ప్రముఖ మహాకవి శేషేంద్ర శర్మ రచించిన 'ఆధునిక మహాభారతం'లోని ఒక కవితను
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ X లో పంచుకున్నారు. 'ఏ రస్తా యుద్ధాలు చేస్తూ, ప్రాణాలను విసిరేస్తూ, గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకు సాగుతుందో.. ఎక్కడ సంకెళ్లు సవాల్ చేస్తాయో, అపజయం అగ్నిజ్వాలై మండుతుందో, మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో.. అదే నా రస్తా' అని ఆయన తన మార్గాన్ని వివరిస్తూ కవితలోని పంక్తులను ఉటంకించారు. ఈ కవిత ద్వారా తన రాజకీయ ప్రస్థానం, ఎదురయ్యే సవాళ్లను ఆయన పరోక్షంగా తెలియజేశారు.