ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: హరీశ్ రావు

4406చూసినవారు
TG: రాష్ట్రంలో నెలకొన్న కరువుకు ప్రకృతి కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సిన యాదాద్రిలో బొగ్గు కొరతతో కేవలం 1500-1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కొత్తగూడెంలో 800 మెగావాట్లు ఉత్పత్తి నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని మెటార్లు సిద్ధంగా ఉన్నాయని అయినా ప్రభుత్వం నీళ్లు ఎత్తడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్