
ఆప్ ఎమ్మెల్యేపై చెప్పు విసిరిన దుండగుడు (వీడియో)
ఆప్ ఎమ్మెల్యేపై ఓ దుండగుడు చెప్పు విసిరాడు. ఈ ఘటన గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది. ఆప్ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ఓ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా వేదిక ముందుకు వచ్చి ఎమ్మెల్యేపై చెప్పు విసిరాడు. వెంటనే సదరు వ్యక్తిపై ఆప్ కార్యకర్తలు దాడి చేశారు. అయితే అతడు ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




