TG: ఉమ్మడి నల్గొండలో చురుకైన నేతగా పేరుగాంచిన రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పట్టభద్రుల
కాంగ్రెస్ MLC అభ్యర్థిగా నిలిచారు. ఆయన OUలో గ్రాడ్యుయేషన్, USలో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం AICC సభ్యుడిగా ఉన్న ఆయన, 2012 నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో PCC సభ్యుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు. ఆయన తండ్రి దివంగత రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు.