TG: రచయిత అందెశ్రీ పాత వరంగల్ జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ప్రజాకవి, ప్రకృతి కవిగా పేరుగాంచిన ఆయన.. చిన్నతనంలో పాఠశాలకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో గొడ్ల కాపరిగా పల్లె, జానపద పాటలతో జీవితం గడిపారు. 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు'లాంటి మనుషుల్ని, మనసుల్ని మేల్కొలిపే పాటలు రాసిన ప్రజాకవికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది.