దేశంలోనే అత్యంత శుభ్రమైన నది ఇదే

2చూసినవారు
దేశంలోనే అత్యంత శుభ్రమైన నది ఇదే
మేఘాలయలోని ఉమ్‌గోట్‌ నది అత్యంత స్వచ్ఛమైన నదుల్లో ఒకటిగా పేరుగాంచింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుకు సమీపంలోని డాకి పట్టణం వద్ద ప్రవహించే ఈ నదిని ‘డాకి నది’ అని కూడా పిలుస్తారు. నీరు అంత పారదర్శకంగా ఉండటంతో పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అడుగున ఉన్న రాళ్లు, గులకరాళ్లు, చేపలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో పడవలు నీటిపై కాకుండా గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తాయి. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఇక్కడ బోటింగ్‌కు అనుకూల సమయంగా చెబుతారు.

సంబంధిత పోస్ట్