తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషించిన బీఆర్ఎస్ పార్టీ తన రజతోత్సవ సంబరాలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ప్రారంభమై, 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో 2022లో 'BRS'గా రూపాంతరం చెందింది.