ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పండుగలకు ఊరెళ్తున్నారా? ఇంటి భద్రతకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Jan 12, 2026, 11:01 IST/

పండుగలకు ఊరెళ్తున్నారా? ఇంటి భద్రతకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Jan 12, 2026, 11:01 IST
సంక్రాంతి వంటి పెద్ద పండుగల సందర్భంగా చాలామంది తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేటప్పుడు ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయడం, ఫ్రిజ్‌ను ఖాళీ చేసి శుభ్రం చేయడం, గ్యాస్ ట్యాప్ ఆఫ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను నివారించడానికి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలి. విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచాలి. ఇంటి ముందు CCTV కెమెరాలను గేటు వైపుకు తిప్పి, అనుమానాస్పద కదలికలను గుర్తించినప్పుడు మొబైల్‌లో నోటిఫికేషన్లు వచ్చేలా సెట్ చేసుకోవాలి. పొరుగువారిని ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని కోరడం కూడా మంచిది.