అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయొద్దని ప్రధాని నరేంద్ర
మోదీ సెప్టెంబర్ 1న మరోసారి పిలుపునిచ్చారు. భారత్ బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. బంగారం దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటుపై ఒత్తిడి పెరుగుతోంది. FY26లో దేశ బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అందుకే అనవసర బంగారం కొనుగోళ్లను తగ్గించి స్వదేశీ వినియోగాన్ని పెంచాలని
మోదీ సూచించారు.