మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'చిరుత'తో హీరోగా పరిచయమై 'మగధీర'తో రికార్డులు సృష్టించారు. అయితే, 'ఆరెంజ్' సినిమా భారీ డిజాస్టర్ కావడంతో, తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త వహించారు. దర్శకుడు ధరణి చెప్పిన కథతో 'మెరుపు' సినిమా ప్రారంభమైనా, మొదటి షెడ్యూల్‌కే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. 'ఆరెంజ్' సినిమా నష్టాలను దృష్టిలో ఉంచుకుని
చిరంజీవి ఆ సినిమాను ఆపేశారు. అనంతరం, సంపత్ నంది చెప్పిన 'రచ్చ' సినిమాను తక్కువ బడ్జెట్లో పూర్తి చేసి, రామ్ చరణ్ విజయపథంలోకి దూసుకొచ్చారు.